Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters   

జన్మతత్త్వ వివేకము

(గర్భోపనిషత్తు ఇట్లు తెలుపుచున్నది.)

1 పృధినీ 2 ఆపః 3 తేజః 4 వాయుః 5 ఆకాశములచే నిర్మింపబడినదీ దేహము. శరీరమున కఠిన భాగము భూతత్వము ద్రవ భాగము జలతత్వము రూపభాగము అగ్ని తత్వము వాయుభాగము చలనతత్వము, ఆకాశ భాగము సన్నని రంధ్రము వలె నుండు అవకాశ (కాళీ) తత్వమును తెలుపును.

2. 1 పృధిని ధరించుటయు, 2 జలము ముద్ద చేయుటయు, 3 అగ్ని ఉష్ణమును, రూపమును చేయుటయు, 4 వాయువు గమనాది చలనము చేయుటయు, 5 ఆకాశము ఖాళీ=సందు=రంధ్రము=అవకాశము నిచ్చుటయు చేయును.

3. పంచ భూతలములగు గుణములు, 1. భూమి గంధ=పరిమళ గుణమును, 2 జలము రస=రుచిని తెలుపు గుణమును, 3. తేజము రూపగుణమును, 4. వాయువు స్పర్శగుణమును, 5 ఆకాశము శబ్ద గుణమును తెలుపును ఇవి పంచతన్మాత్ర లనబడును.

4 1 శబ్దమును గ్రహించుటకు శ్రోత్రములును, 2 స్పర్శ గుణమును గ్రహించుటకు త్వగింద్రియమును, 3 రూపగుణమును గ్రహించుటకు నేత్రేంద్రియములును, 4 రస గుణ గ్రహణమునకు జిహ్వ=నాలుక= రసనము అను ఇంద్రియమును 5 గంధ=పరిమిళమును గ్రహించుటకు ఘ్రణ=నాసిక=అను ఇంద్రియమును, ఉపయోగపడును. ఇవి జ్ఞానేంద్రియములు.

5. 1 శబ్దమును పలుకుటకు వాక్కు. 2 స్పర్శమును చేయుటకు పాణియు, 3 పాదములు గమనక్రియ చేయుటకును 4 పాయువు, మూత్ర పురీషోత్సర్జనములకును, 5 ఉపస్థ (జననేంద్రియము) పుత్ర జనవమున గలుగు ఆనందానుభవమునకును, ఉపయోగించును. ఇవి కర్మేంద్రియము లనబడును. అంతఃకరణము / బుద్ధి=నిశ్చయించుటకును, 2 మనస్సు = సంకల్ప వికల్పములను చేయుటకును, 3 చిత్తము = లెస్సగా తెలియుటకును, 4 అహంకారము = నేను చేయుచున్నానని ఆయా పనుల యందును వర్తించుచు చతుర్విధములుగా నుండును. ఇట్లరువది నాలుగు తత్త్వములతో గూడి యుండునీ దేహము.

6. 1 మధుర=తీపి 2. ఆవ్లు=పులుపు 3. లవణ=ఉప్పు 4. కటు=కారము, 5. కషాయ=వగరు 6 తిక=చేదు అనెడి షడ్రస=ఆరు రుచులతో కూడిన ఆహార పదార్థముల నుంచి జనించినదీ శరీరము. మఱియు,

7. 1. ఉనికి 2 పుట్టుట 3. వృద్ధినొందుట 4. పరిణమించుట అనగా బాల్య ¸°వన కౌమారాదులచే మార్పునొందుట, 5 వార్థక్యములచే కృశించి, చిక్కిపోవుట, పన్నులూడుట, వళులు ఏర్పడుట, 6. తుదకు నశించుట యనెడి ఆరు వికార (షడ్వకార)ములతో కూడినదీ కాయము. మఱియు

8. 1 మూలాధార 2 స్వాధిష్ఠాన 3 మణిపూరక 4 అనాహిత 5 విశుద్ధ 6 అజ్ఞా, అనియెడి ఆరు చక్ర (పద్మము)లతో నొప్పుచున్నదీ కళేబరము. మఱియు

9. 1 కామము 2 క్రోధము 3 లోభము 4 మోహము 5 మదము 6 మాత్సర్యము అనెడి ఆరుగురు శత్రువులతో గూడినదీ మేను-మఱియు,

10. 1 శమము 2 దమము 3 తితిక్ష 4 ఉపరతి 5 శ్రద్ధ 6 సమాధానము అనెడి ఆరు యోగములతో గూడునదిగా (శమాదిషట్క సంపదతో) నుండవలెను.

11. మఱియు 1 చర్మము 2 మాంసము 3 రుధిరము=రక్తము4 మేధస్సు 5 మజ్జ 6 స్నాయువు 7 అస్థులు అనెడి సప్త విధ ధాతువులతో గూడినదీ దేహము. మఱియు,

12 1 షడ్జము=శుద్ధము 2 ఋషభము 3 గాంధారము 4 మధ్యమము 5 పంచమము 6 దైవతము 7 నిషాదము అనెడి సప్తస్వర (నాద)ములతో గూడినదీ కాయము. మఱియును,

13. 1 శుక్ల=తెలుపు 2 రక్త=ఎఱుపు 3 కృష్ణ=నలుపు 4 ధూమ్ర=(బూడిద) 5 పీత=పసుపు 6 కపిల 7 పొడరము లనియెడి సప్తధాతువులకు సంబంధించిన వర్ణములు=రంగులు గలిగియున్నదీ కళేబరము మఱియు,

14. 1 అన్నరసము, వలన శోణితము=రక్తము, 2 శోణితము వలన మాంసము, కండరములును, 3 మాంసము నుండి మేధస్సు, 4 మేధస్సు నుండి స్నాయువులు 5 స్నాయువుల నుండి అస్థులు=ఎముకలు 6అస్థుల నుండి మజ్జ=తూడు7. మజ్జ నుండి శుక్లము=వీర్యము అనెడి ధాతువులు కలిగినదీ కాయము, ప్రకాశించుచున్నది.

15. శుక్ల శోణిత (పురుషుని, శుక్లము=వీర్యము, స్త్రీ యొక్క శోణితము=రక్తము) సంయోగము వలన పురుషుని మూలమున, స్త్రీ యొక్క గర్భకోశమున, ఉంచ (ఆదానము చేయ)బడిన పిమ్మట గర్భ మేర్పడును. హృదయము వలన 1 అగ్ని 2 పిత్తము 3 వాయువు వలన ఒక రాత్రి కాలమున కలలము=చిక్కబడును. 7 రాత్రులుండుటచే బుడగగా మారును. 15 రోజులకు పిండాకృతిని=ముద్దగా మారును. 30 రోజులకు ఆ పిండము గట్టిపడును=అనగా ఘనీభవించును. 2 మాసములకు (కర్పరము) శిరము ఏర్పడును. 3 మాసములకు పాదములు ఏర్పడును. 4 మాసములకు జఠరము, కటి జఘన ప్రదేశములు ఏర్పడును. 5వ మాసమునకు వెన్నుపాము= పృష్ఠమశము=వీణా దండము ఏర్పడును. 6వ మాసమున నాసికా నేత్ర శోత్ర, ముఖ భాగములు శీర్షమున ఏర్పడును.

7వ మాసమున జీవ ప్రవేశము జరుగును. (కాన ఆరు మాసములు గడచినచో, పురిటితో సమానమని ధర్మశాస్త్రవచనములు గలవు. కొన్ని తాపులందు 6వ మాసముననే జీవ ప్రవేశము జరుగుననియు తెలుపబడెను.)

1. భగవాన్‌ వ్యాస విరచితమగు సూతసంహితయను గ్రంథమున, గర్భోత్పత్తి ప్రకరణమునందును, ఏడవ మాసము నందే, జీవుడు ప్రవేశించునని తెలుపబడెను దీని చుతుర్వేద వ్యాఖ్యాతలగు శ్రీ విద్యారణ్య స్వామివారు గర్భోప నిషత్తును తమ వ్యాఖ్యయందు ఉటంకించిరి(ఉదాహరించిరి).

2. అద్యాత్మరామాయణమునందు, కిష్కింధా కాండమునందు, తుదిభాగమున జఠాయువు యొక్క అగ్రజుడగు సంపాతియను గృధ్రరాజు శరీరోత్పత్తిని గూర్చి తెలుపు సందర్భమున ఐదవ మాసమున గర్భమున జీవప్రవేశము జరుగునని తెలిపియుండెను.

3. శివగీతయందు ఆరవ మాసనమున జీవుడు ప్రవేశించునని తెలుపబడెను ఇట్టి భేదములందును కాననగును.

4. గర్భగీతయందురు అట్లే తెలుపబడెను. ఇట్టి భేదముండుటకు కారణము లేకపోదు. ఇట్లు వేరువేరుగా తెలుపుటకు కారణమేమి? ఒక గృహస్థుడు గృహనిర్మాణమును దూలములు, కడ్డీలు, కిటికిలు, ద్వారములు ఇనుపసామానులు సిద్ధపఱచుకొనుటచే గృహము త్వరలో పూర్తికావచ్చును. అందువలన అప్పుడతడు ముందుగా గృహమున ప్రవేశించును. ఇంకొకడు గృహనిర్మాణ సామానులు లభించుటలో ఆలస్యమగుటచే గృహము అలస్యముగా తయారగును. కనుక అతడు ఆలస్యంగా గృహ ప్రవేశము చేయగలుగును. అట్లే జీవుని సంస్కారముననుసరించి, నిర్మంపబడిన శరీరమనెడి గృహమున అనగా ''ఆత్మాత్వం- గిరిజామతిః- సహకరాః ప్రాణాః- శరీరం గృహం'' అని ఆత్మపూజా విషయమున చెప్పబడి యున్నందున, ఐదవ, లేక, ఆరవ, లేక, ఏడవ మాసమున గర్భమనెడి గృహున జీవుడనెడి చైతన్య ప్రకాశము ప్రవేశించుంచుండునని ఊహింపతగియున్నది.

1. అధిష్ఠాన చైతన్యము, అనగా సర్వ శరీరములయం దనుసూత్యముగా, వ్యాపించిన పరమాత్మ చైతన్యము. 2. ప్రతిబింబ చైతన్యము (అనగా ''సూర్య ఆత్మా జగతస్త స్థుషశ్చ'' అని చెప్పబడినట్లు సూర్య ప్రతిబింబము, ఘటంలో నుండెడి జలము నందును, నదులందలి ఊర్మిమాల లందును, దర్పణమందును, ప్రతిబింబించినట్లు ఉండును) 3 అవిద్య=అజ్ఞానము=మాయ అనెడి మూడు కలిసి జీవుడు అని వ్యవహరింపబడును. అట్టి జీవుడు, ముస్లిము మతస్థుడుగను, క్రైస్తవ మతస్థుడుగను, జైన-బౌద్ధతస్థుడగను, బ్రహ్మ-క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ జాతివాడుగాను పూర్వ దేహమందు ఉండి, ఆ శరీరమును వదలి, ఈ నూతనముగా నేర్పడిన గర్భస్థ పిండమనెడి గృహమున ప్రవేశింపవచ్చును. అప్పుడు ఆ జీవుని పూర్వ జన్మ పుణ్య పాప కర్మఫల సంస్కారము ననుసరించియు, శుచియగు కర్మ-జ్ఞాన యోగిపుంగవులు గర్భ గృహము నందుగాని, లేక శ్రీమంతులగు మహారాజ కుటుంబములోగాని, బాగ్యవంతుల గృహము నందుగాని జీవ ప్రవేశము జరుగుచుండును. ఆ జీవుని పూర్వ జన్మపుణ్య పాప ఫల సంస్కారముల ననుసరించిన, గుణములును, బుద్ధులను, ఆకారములను, నడవడికలును, ఆలవాట్లును ప్రవర్తనములును కలుగుచుండును. నీచ గుణములు గల పూర్వ శరీరమును వదిలిన జీవుడు, ఉత్తమ వంశములందును, ఉత్తమవంశములందు శరీరమును వదలిన జీవుడు అధమ వంశము లందును, ఆయా శరీరములలోని జీవుని పుణ్యపాపకర్మ ఫలానుసారము ప్రవేశించు చుండవచ్చును. ఆ దోష నివారణముకు గాను తండ్రి- ఆ బైజికదోష నివృత్తికై జాతకర్మములను ఉపనయనాది, సంస్కారములను చేయుచుండును. మహాపుణ్యాత్ముడును, దానధర్మముల నొనరించిన, నృగమహారాజు, ఊసరవెల్లియై జనించెను. ఒకడు రాజునకు సర్పరూపమున జనించెను. ఒకడు కరియై జనించెను. వేరొకడు మకరియై జనించెను. జడభరతుడు మహాముని లేడియై జనించెను. కనుక అనేక నీచయోనులందును జనింపవచ్చును అప్పట్టున ఆ జన్మములలో సంస్కారములు లేక దోషనివారణము జరుగక పోవచ్చును. ఇట్లే గర్భ ప్రవేశములు జరుగుచుండును. ఇట్లు శాస్త్రములందును, పురాణ గ్రంధములందును చెప్పబడి యుండెను.

8వ మాసమున సర్వావయవ సంపూర్ణమై దేహము గర్భమున చలించుచుండును. శుక్లమను భాగము పురుష సంబంధమైన వీర్యము శోణితము స్త్రీకి సంబంధించిన రక్త భాగము- రెండు భాగములు సమానమైనచో నపుసంక శరీరమేర్పడును. పితృసంబంధమైన శుక్లాధిక్యమున పురుష శిశువు జన్మించెను. స్త్రీ (మాతృ) సంబంధమగు శోణితమధికమైన ఎడల స్త్రీ శిశువు జనించును పితృమానస వ్యాకులత వలన గ్రుడ్డి, కుంటి, పొట్టి, మరుగుజ్జు, అవయవాధిక్యతను గాని, 12గాని, 24 చేతివ్రేళ్ళు కలుగుచుండును. స్త్రీల కామాధిక్యత వలన బహుళముగ సంతతి కలుగును. 1 కాలము 2 క్రియ 3 ద్రవ్య 4 భోగములనెడి ఉపాధులవలన ఉపచిత-అపచిత-అనురూప-అననురూపములుగా సంతానము గలుగును, ఉభయుల మనస్సులు వైకల్యము లేక లెస్సగా నున్నచో సమాన గుణ సౌందర్య-రూప-లావణ్యముతో జనింతురు. ఉభయులకు వాయువు యొక్క పీడనశక్తి హెచ్చయినచో, కవలలు జనింతురు. సమ్యక్‌ ధ్యానము, జ్ఞానము వలన అక్షరమైన ఓంకారమున చింతించుచుండును. అష్టవిధ ప్రకృతులు పరిపుష్టములగును. పిమ్మట సవమమాసమున గర్భస్థ పిండము, సర్వ పరిపూర్ణ లక్షణములతో శిశువుగా, గర్భమున, ఏర్పడును. పూర్వజన్మ సుకృతమును, కృతము అనగా చేసిన పనులును, చేయతగిన పనులను చేయక పోవుటను, జీవుని మనస్సునకు స్ఫురించును. శుభాశుభ కర్మమును తెలియుచుండును. ఎట్లనగా, 84 లక్షల (అనేక) యోనులయందు వేలకొలది జన్మములను పొందితిని. అనేకమంది తల్లుల స్తన్యములను త్రాగితిని. మాంసము మున్నగు వివిధ రకముల ఆహారముల ననుభవించి, భుజించి యుంటిని, భూమి యంతయు నాకుస్మశాన భూమియే. అనగా భూలోకమున వివిధ ప్రదేశముల యందు, వివిధ భాషలు, వివిధా హారములను భుజించిన మాతాపితరులకు జనించితిని. అనేక దేశములలో మరణించి, శ్మశాన వాటికలందు భస్మముగను, ఖననముగను, జలమున వదులుటయును అనుభవించితిని. 84 లక్షల జీవరాసుల యోనుల యందు పుట్టి, పుట్టి, చచ్చి, చచ్చి యీ సంసారమున చచ్చుట, మరల పుట్టుట, పుట్టుట, మరల చచ్చుట, ఇట్లు మృతుడనగుచు, జన్మముల ననుభవించుచు, మాటిమాటికి జన్మ మృత్యువును, మృత్యుజన్మములను, మరల జన్మము, మరల మరణములు, మరల జనించుట మరల మృతియు జరుగుచు గర్భావాహసమున మహా త్తర దుఃఖ మనుభవించితిని. పుట్టిన పిదప బాల్యమున దుఃఖము ననుభవించితిని. పరుల వశమునను, మూఢత్వమునను, మహా మోహాంధరకారమునను చరించితిని. శాస్త్రహితమైన సత్కర్మలను చేయకను, చేయతగిన వానిని ఆలపించియు, పిమ్మట చేయవచ్చుననియు తలచి, శాస్త్రహిత కర్మలను చేయకపోతిని. అనగా సంధ్యాది సత్కర్మల అననుష్ఠానమునను, నిందత కార్యనిషేవణ మొనర్చితిని అని భావము. ¸°వన దశలో విషయలోలుడనై ఆధ్మాత్తికాది దైవికాది భౌతికములగు త్రివిధ తాపముల ననుభవించితిని. వార్థకమున పలు విధములైన చితంలకు లోనై మెలంగితిని. రోగములతొ బాధ నొందితిని, మరల భీతిని మెలంగతిని, ఆశాపాశ నిబద్ధుడనై, స్తబ్దుడనై, అభిమాన పూరితుడనై, కామక్రోధాదులతో సంకటపడి, దుఃఖ బీజమైన జన్మములలో దుస్సహమైన దుఃఖమును పొందితిని. నివృత్తి ధర్మమా? లభింపలేద. యోగ మార్గమా? అవలంబింప లేదు. జ్ఞాన మార్గము బొత్తుగా దొరకలేదు. ఈ దుఃఖ సాగరమున పడియుండి జన్మమృత్యువులకు ప్రతి క్రియ చేయు విధానమును కానక పోతిని. ఛీ-ఛీ ఈ అజ్ఞానమేమి? ఈ కామక్రోధ బాధఏమి? ఆచార్య! గురుదేవా! ఓ దైవమా! ఛీ.ఛీ అజానమును పొందితిని.

ఈ యోని నుంచి బటయపడిన ఎడల సాంఖ్య శాస్త్రమును, యోగ శాస్త్రమును ఆశ్రయించి, చదివి, అనుభవమును సంపాదింతును. ఈ గర్భ నరకము నుండి విడువబడిన ఎడల, అశుభకర్మముల క్షయ మొనర్చువాడును, దివ్యభోగ ఫల సంధాతయునగు మహేశ్వరుని ప్రవత్తిచేయుచు సేవించెదను. ఈ ఇరుకు కారాగార గృహమగు యోనినుండి విడువబడిన ఎడల, పరమ పురుషార్థ ప్రదాతయ నశుభ కర్మ ఫల క్షయకర్తయునగు జగదీశుని సేవింతును. సర్వ కారణుండగు చిదాత్మను పరమాత్మను, ఈ యోని నుండి వెలుపలకు వచ్చెడి భాగ్యమును కలిగించిన ఎడల, జగద్గువురువును, పశుపతియునగు రుద్రుని గూర్చి రుద్రాధ్యాయమును నిరంతరము పఠించుచు మహత్తర తపం బొనర్చెదను. గర్భావాసము నుంచి విడుదల అయిన ఎడల, హృదయమున విష్ణుని, భజించెదను. గర్భ నరకము నుండి వెలుపల పడిన ఎడల అమృతప్రదుడును, అవామయుడును అగు నారాయణుని, వాసుదేవుని వామదేవుని, నిరంతరము ధ్యానించి సంతోషపఱచెదను గాక.

ఒరులకొనర్చిన అపకారము ఉపకారము మున్నగు శుభాశుభకర్మ ఫలమును ఒంటరినై యీ గర్భమున దహింపబడు చుంటిని. నాస్తిక భావముతో గూడ భయమనునది ఎరుగక వివిధ పాపములను చేసితిని ఈ దుఃఖము తొలగిన ఎడల, ఆ సిక్యభావమున మెలంగుదును. సంధ్యాది సత్కర్యములను, యజ్ఞాది శ్రౌతకర్మములను చేయుదును. నానా విధములగు అనర్థదాయకమగు పనులను వదలి, మాటిమాటికి సంసార దుఃఖమును స్మరింపుచు, నిర్వేదమునొందుచు, అవిద్యా కామకర్మాదులతో మోహపడి, యోని ద్వారాము కడకేగుదెంచి, విడుదలకై ప్రయత్నింతురు. ప్రసవమునకు శక్తి జాలనిచో, యంత్ర సహాయమున లాగుటయో, శస్త్రముచే ఖండములుగా చేయబడుటయో, యోని ద్వారమున వీలుగానిచో, పొట్టను చీల్చియో, లేక ప్రసూతి వాయు ప్రయోగముననో ఇంజక్షన్‌లు, మందులు ఓషధులను నాభివద్దనుంచియో తంత్ర విద్యలచేతనో, వైష్ణవ వాయు ప్రయోగముననో, బయటపడి, వైష్ణవ మాయలో స్పృశింపబడి పూర్వ స్మృతిని ఏమియు ఎరుగని స్థితిలోపడి పరలోక జ్ఞానము గాని అపరోక్ష జ్ఞానము గాని లేక, భూమియొక్క స్పర్శవలన, పామరుడనై కలినీటి సంస్పర్శచే ఊర్థ్వలోక దృష్టి నశించి జన్మమృత్యు శుభాశుభ సాధనముల వాసనలను ఎరుంగక, క్లేశముల నొందుచు, వాత-పిత్త-శ్లేష్మధాతుత్ర యములతో గూడి, అవి సమానములుగానున్న ఎడల ఆరోగ్యముగాను, హెచ్చు తగ్గులగనున్న విషయమావస్థ కలిగిన ఎడల రోగములతోను, బాధనొందును. పిత్తధాతువు వలన నామరూపముల నెరుంగును. ఎక్కవ తక్కువలుగనున్న ఉన్మత్మస్థితి కలుగును. స్థూల సూక్ష్మ కారణ శరీరములయందు జ్ఞానాన్ని-దర్శనాగ్ని-కోష్టాగ్ని, జఠరాగ్ని, దహరాగ్ని అనెడి పంచ(త్రి) విధములుగ వైశ్వనరాగ్ని వెలుంగుచుండును. జ్ఞానాగ్ని మానసియగును. దర్శనాగ్ని ఇంద్రియములకు చెందియు, కోష్టాగ్ని దేవామునందును ఉండి భక్ష్య- భోజ్య - లేహ్య- పానీయ చోష్యాధికమును నిత్యము వచనము చేయుచు శరీర భాగములకు చేర్చు చుండును.

దృక్కు దర్శనాగ్ని దానికి మూడు స్థానములు నివాస స్థలములు. ఇంద్రియ గోళములు ఉపస్థానములు. కన్నులు అవపథము. 1 హృదయమును దక్షిణాగ్నియు 2 ఉదరమునగా ర్హపత్యాగ్ని 3 ముఖమున ఆహవనీ యాగ్ని యను శ్రౌతాగ్ని త్రయము శరీరమున గలదు. శరీరమున గల జీవుడు (పురుషుడు) యజ్ఞమునకు యజమానియై యుండును. బుద్ధి ఆ యజ్ఞకర్తకు భార్యయగును. దీక్ష, సంతోషము యజ్ఞపాత్రలు జ్ఞానేంద్రియమలు. కర్మేంద్రియములు ఉపకరణమలు. శారీరక యజ్ఞమున ఆయా ఇంద్రియాధి దేవతలు ఋత్విక్కులుగా నుందురు. యజ్ఞశాలా, శరీరము, హోమ కుండము శిరస్సు. శిరోజములు=కేశములు. పవిత్రములగు దర్భ పత్రములు. ముఖము అంతర్వేది. కామము హోమ ద్రవ్యమగు ఆజ్యము=నెయ్యి. జీవిత కాలము సత్ర=యాగశాల. దహరా కాశమున గల అనాహిత ధ్వని సామవేదము. వైఖరీ యజుర్వేదము. పరాపశ్యంతీ మధ్యమా ఋగ్వేదము. ఆయువు బలము. పిత్తము పశువులు. మరణం అవబృధ స్నానము. ఇట్లు శారీరక యజ్ఞమన త్రేతాగ్నులు జ్వలించు చుండును. జీవులు సర్వులు యజ్ఞక ర్తలే సుమా! సహ యజ్ఞః ప్రజాః సృష్టాః అని భగవద్గీత తెలుపును. యజ్ఞము చేయనివాడు జీవింపడు. యజ్ఞము కొరకే ఈ శరీరము ప్రాప్తించినది. అటచ దేవతలు సంసార సుఖమనెడి స్వర్గ సౌఖ్యము ననుభవింతురు. యజ్ఞమున గలుగు లోపముల వలన దుఃఖాబ్ధిని పొందెదరు. శరీరమునందు 16 జతల దంత పటలములును, 15 సన్నని (సుషిరము) రంధ్రములును, 96 అంగుళముల కొలతయును, 14 నాడీ స్థానములును, 108 మర్మముల, 72 వేల సంఖ్య గల ధమనులును గలవు. ఆ 72 వేల నాడుల (ధమనుల) యందు 1 ఇడా 2 పింగళ 3 సుషుమ్న అనునవి పరమ ముఖ్యమైనవి. నాల్గవది పురీతతి. 5వది జీవితము. జీవిత పర్యంతము పిత్తము. పిత్తము నకు అడుగున పురీతతి కలదు. నాభికి పైభాగమున రెండం గుళముల దూరమున ఎడమవైపున పిత్తమూలము కలదు. అది భుజించిన ఆహారమును త్రివిధములగా విభజించు చుండును.

1 మూత్రము 2 పురీషము 3 సారము అనెడి త్రివిధ ములుగా విభజించును. మూత్రము రెండు విధములుగను, పురీషము సప్త విధములుగను, కుడివైపు కలదు. సారము పంచ (ఐదు) విధములుగా శరీరమున వ్యాపించును. భుజించు అన్న పానముల వలన రేతస్సు (శుక్లము) శోణితము (రక్తము) కలుగుచున్నవి. దేహమున ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమున వాయువు చలించును. అదియే ప్రాణ మనబడును. సూత్రము వలె సుషిరములందు వ్యాపించిన ఆత్మపదార్థము ఉచ్ఛ్వాస నిశ్వాసములను చేయుచుండును. ఆశ్వాస ప్రశ్వాసములు లేనిది శరీరం జీవింపదు. వాయువుచే రక్త ప్రవాహములు, నాడులు, చక్రములు చలించును. దాని వలననే తనను తాను చూచు శక్తి కలుగును. ఆహారము పక్వ (పచన) మైన అన్నరసము కుక్షియందు ప్రవేశించి మాలిగా, ఏర్పడి శిశువు యొక్క శిరమున గల కపాలమున ప్రవేశించి, సుషుమ్నానాడి ద్వారమున గర్భస్థమైన శిశువు యొక్క ప్రాణమును తృప్తి పరచుచు రక్షించును. సుషుమ్న యనునదియే బ్రహ్మనాడి యనబడుచున్నది. జన్మమునకు గర్భస్థ జీవుని శరీరమున హృదయమునకు చేరును. యొగ మార్గముచే సుషుమ్నాంతమున నున్న భ్రూమధ్య భాగమును పొంది గర్భస్థ జీవుని పరోక్ష జ్ఞానినిగా చేయును. అట్టి అంతర్యామియైన ఆత్మ అమృత స్వరూపమై, సర్వసాక్షియై, పురుషుడను పేరున నుండును. అవిద్యచే ఆవరింపబడి జీవుడనెడి పేరున అభిమానించుచు, ప్రాణి అజ్ఞానముచే బీజ భూతముగా నుండి అది అంతఃకరణమను పేరున మొలక ఎత్తి (అంకురించి) అది వృక్షమై ఎనిమిది కోట్ల లోహములతో, ఎనుబది వందల సందులతోను, తొమ్మివందల స్నాయువులలును, ఎనిమిది పలముల హృదయమును, పండ్రెండు పలముల జిహ్వతోను, పిత్తము నాలుగు మానికల (ప్రస్థము) కొలతతోను, కఫము కుంచ (ఆఢక)ము కొలతతోను, శుక్లము (కుడపము) మానెడు కొలతతోను, మేదస్సు రెండు ప్రస్థముల (ఎనిమిది మానికల) కొలతతొను, ఉండునది. ఇది అంతయు (నశ్వరము) నశించునది యని ఎఱింగి, గర్భగుడగు జీవుడు సుషుమ్నా నాడియందుండి, వివేకవంతుడు సంసార (జనన మరణ రూప) బంధమునుండి విడివడును, అతడు మరల శరీరమును ధరింపక ముక్తుడగునని భావము. నసపునరావర్తతే- అతడు మరల పునర్జన్మమును పొందజాలడు. అట్లుగాక అజ్ఞాన విలసితుడు సంసారసాగరమన మునింగి క్రిమిసంకులమైన మూత్ర పురుషములతో గూడిన నరకమున పడి బాధల ననుభవించునట్లు ఇచల యీ లోకమునందే యీ శరీరమునందే అనుభవించినట్లే తెలిసికొని నిర్వేదము నొందును సుమా!

పైప్పలాదుని మోక్ష శాస్త్రము పరిసమాప్తము. గర్భోపనిషత్‌ సమాప్తము.

గ్రంథకర్తను గూర్చిన కొందఱి పలుకులు

ఆర్యా!

మీరు రచించిన గ్రంథములన్నియు ముద్రణమై లోకమున వెలువరించు వఱకును, ప్రచారమగుదాకా, మీకు భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యములను, మానసిక శక్తిని, శరీర దార్ఢ్యమును, ఇచ్చి రక్షించుగాక యనినా ప్రార్థన.

ఇట్లు మీ వాడ,

ది. 3-4-79 గుండు వెంకటసుబ్రహ్మణ్యము

సాయి నిలయం

పాగబండ, ఖమ్మం రిటైర్డు అసిస్టెంటు ఇంజనీరు

శాస్త్రిగారికి, మీకు గాయత్రీ మాతృదేవి యొక్క అనుగ్రహ మెంతయున్నదో, నాకు తెలియును. అదిమీకు తెలియకపోవచ్చును. మీ కృషి నిరంతరము జరుగుగాకయని నా యాశయము.

సౌధన గ్రంథమండలి ఇట్లు భవదీయుడు

తెనాలి, గుంటూరు జిల్లా బులుసు సూర్యప్రకాశ శాస్త్రి

ప్రియ సోదరులకు, సకల శుభాశీస్సులు. శ్రీ గాయత్రీదేవి ఒక శుభకార్యమును త్వరలో నిర్వహించులాగున మిమ్ములను ఆశీర్వదిస్తూ యున్నది. తమలో ఎంత గాయత్రీ శక్తి యున్నదో గాయత్రీదేవి నాకు చెప్పనే చెప్పింది. మీ ఇంటికి తప్పక గాయత్రీదేవితో మాట్లాడుటకు వచ్చెదను. మీరిటకు రానక్కరలేదు. నా అనుభుతిని మీ కెఱింగింతును.

మండలపేట ఇట్లు మీ సోదరుడు

తూర్పుగోదావరి జిల్లా పున్నమరాజు జనార్దనరావు

6-4-79

చందాదారుల పట్టిక

1. శ్రీ ప్రఖ్యా రాధాకృష్ణమూర్తి (పి.ఆర్‌.కె.మూర్తి)గారు, రైల్వే ట్రాఫిక్‌ ఇనస్పెక్టర్‌ భీమవరము పశ్చిమగోదావరి జిల్లా శ్రీయుత పాలకోడేటి రామకృష్ణ శర్మ (పి, ఆర్‌.కె.శర్మ)గారు డాక్టర్‌ వారికి గాను సంధ్యా గ్రంథములను పంపుటకై పంపిన విరాళము 9_00

2. శ్రీ ప్రఖ్యా సూర్యనారాయణగారు రైల్వే డిపార్టుమెంటు ఉద్యోగి- తమ తండ్రిగారి ఆత్మశాంతికి మద్రాసు నుంచి ప్రఖ్యా రాధాకృష్ణమూర్తిగారి ఆదేశప్రకారము M.O.గా పంపిన విరాళము 116-00

3. శ్రీ పులిగెడ్డ జనార్దనరావుగారు విద్యాధరపురము విజయవాడ. రంగుల కంపెనీ ఉద్యోగి కృప చేసిన విరాళము. 37-00

4. శ్రీ బి. కాశీ విశ్వనాధము ఆడిటర్‌ గారు లబ్బీపేట వెంకటేశ్వరపురము విజయవాడ - 10 దయ చేసిన విరాళము- 10-00

5. శ్రీ మల్లాది వెంకట కుటుంబరావుగారు పేపర్‌ మర్చంట్‌ (కామకోటి నగర్‌ నివాసి) విజయవాడ 5-00

6. శ్రీ సోమరాజు ఆంజనేయులు పంతులుగారు, లబ్బీపేట వెంకటేశ్వరస్వామి వారి ట్రస్టీ (విజయవాడ-10) 10-00

7. శ్రీ వేదాంతము కేశవాచార్యులగారు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అర్చక స్వామిగారు (విజయవాడ-10) 25-00

8. శ్రీ మిత్తింటి అన్నప్ప సోమయాజులుగారు D.E.O. వెస్టు గోదావరి జిల్లా. (కపిలేశ్వరపురము, తూ.గో. జిల్లా నివాసి) 17.00

9. శ్రీ అమృతం కోటయ్యనాయుడుగారు డాక్టర్‌ కోటయ్యనాయుడు గార్డెన్సు, మద్రాసు 51-00

10. శ్రీ మహా తపస్వి, నిరతాన్న దాతలగు చల్లా సుబ్బారాయుడుగారి కుమారులు శివశంకర్‌ శాస్త్రిగారు భీమలాపురము, పశ్చిమగోదావరి జిల్లా. 48.00

11. శ్రీ చేబ్రోలు సుబ్రహ్మణ్యం శాస్త్రిగారు అడ్వొకేట్‌, హైదరాబాదు, విజయనగరకాలనీ 20-00

12 శ్రీ చివుకుల లక్ష్మీకాంతముగారు B.A.,B.Ed. D.E.O వెస్టుగోదావరి జిల్లా.

(దానవాయిపేట. రాజమండ్రి నివాసులు) 107-00

13. శ్రీ తాడిమేటి వెంకటరావు. M.A.L.T గారు S.D.I. of Schools భీమవరము-

(ధానవాయిపేట. రాజమండ్రి వాస్తవ్యులు) 20-00

14. శ్రీ గరిమెళ్ల వెంకటసూర్యనారాయణ MScగారు కాలేజీ లెక్చరర్‌ గారు. విజయనగరం. విజయనగరం జిల్లా 10.00

15. శ్రీ విష్ణువఝల కృష్ణమూర్తి గారు రాజమండ్రి 10-00

16. శ్రీ చాడ అది వెంకటలక్ష్మీనృసింహమూర్తి గారు ప్రిన్సిపాల్‌. జూనియర్‌ కళాశాల మైలవరము. 24-00

Viveka Panchakm anu Jeevitha Rahashyam    Chapters